Mahesh Babu : మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ తరువాత సినిమా తనకు 'మహర్షి' వంటి మంచి విజయం అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్లు, దిల్ రాజు నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా అమెరికాలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. హాలీడేస్‌ను పూర్తి చేసుకుని ఇంకో నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుందని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేనట్టే ఉంది. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్. అందుకే ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరక్కుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో మహేష్‌కు కొన్ని అనుమానాలు ఉండటంతో దర్శకుడు వంశీ వాటిని తీర్చే పనిలో బిజీగా ఉన్నాడట. దానికితోడు కథలో కొన్ని మార్పులు సూచించడాని.. దానికి మరిన్ని రోజులు సమయం పడుతుందని ప్రచారం జరుగుతుంది. మహేష్ ఇమేజ్‌కు సరిపోయేలా ఈ కథ సిద్ధం చేయడానికి దర్శకుడు వంశీ పైడిపల్లికి చాలా సమయమే పడుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే అంటున్నారు.
దీంతో తాజాగా వస్తోన్న సమాచారం మేరకు మహేష్ మరో దర్శకుడితో తన తదుపరి సినిమా చేయనున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా మహేష్ తన 27వ సినిమాను 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ అందించిన పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్. అంతేకాదు ఈ సినిమా మార్చిలోనే ప్రారంభం కానుట్లు సమాచారం. సినిమాను త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలోనే విడుదల చేయాలనీ చూస్తున్నారట దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Geetha govindam, Mahesh babu