మెగా కంపౌండ్‌లో మహేష్ బాబు కొత్త సినిమా...

Mahesh Babu : మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న మహేష్ తన కొత్త చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు.

news18-telugu
Updated: February 18, 2020, 7:39 AM IST
మెగా కంపౌండ్‌లో మహేష్ బాబు కొత్త సినిమా...
మహేష్ బాబు Photo : Twitter
  • Share this:
Mahesh Babu : మహేష్ బాబు తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. మహేష్‌కు జంటగా రష్మిక మందన నటించగా మరో కీలక పాత్రలో విజయశాంతి నటించి సినిమాకు ఎస్సెట్‌గా నిలిచారు. అది అలా ఉంటే తన ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్‌లో ఉన్న మహేష్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండు నెలలకు పైగా అక్కడ గడపనున్న మహేష్ మే నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా మాఫియా బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించనున్నాడు. మరోవైపు మహేష్ బాబు ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారనే వార్తలు చాలా రోజుల నుండి ప్రచారంలో ఉన్నాయి. కానీ వీటిపై ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ మహేష్ బాబుకు ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది మహేష్ బాబుకు నచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు మహేష్ ప్రశాంత్ నీల్‌ను మెగా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వద్దకు కథ నరేట్ చేయడానికి పంపారట. అన్నీ కుదిరితే త్వరలోనే ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇదే జరిగితే వీరి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమా రూపుదిద్దుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

Mahesh babu to work with geetha arts,Mahesh babu new film,mahesh babu,mahesh babu new movie,kgf director prashanth neel meets mahesh babu?,kgf,mahesh babu movies,mahesh babu next movie,prashanth neel with mahesh babu,kgf director's next with mahesh babu,kgf director,kgf director prashanth neel meets mahesh babu,mahesh babu kgf,mahesh babu prashanth neel,yash kgf,mahesh babu and prashanth neel,mahesh babu with prashant neel,మహేష్ కొత్త సినిమా,Mahesh babu with geetha arts
మహేష్ Photo : Twitter

తాజాగా మరో వార్త ఏమంటే.. మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఎప్పటినుండో టాక్ నడుస్తుంది. దానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నా , తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేశాడని, 'బాహుబలి'ని మించేలా ఉండే ఈ భారీ పీరియాడికల్ చిత్రంలో మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh babu to work with geetha arts,Mahesh babu new film,mahesh babu,mahesh babu new movie,kgf director prashanth neel meets mahesh babu?,kgf,mahesh babu movies,mahesh babu next movie,prashanth neel with mahesh babu,kgf director's next with mahesh babu,kgf director,kgf director prashanth neel meets mahesh babu,mahesh babu kgf,mahesh babu prashanth neel,yash kgf,mahesh babu and prashanth neel,mahesh babu with prashant neel,మహేష్ కొత్త సినిమా,Mahesh babu with geetha arts
మహేష్, రాజమౌళి, ప్రభాస్

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు