హిమాలయాలకు మహేష్ బాబు.. అందుకోసమే ఆ పయనం..

మహేష్ బాబు (Mahesh Babu)

Mahesh Babu : మహేష్ బాబు సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమా గురించి ఇంతవరకు ప్రకటించలేదు.

 • Share this:
  Mahesh Babu : మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారం వంశీ పైడిపల్లితో మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా ఆగిపోయిందని టాక్. స్టోరీ నచ్చక మహేష్ ఆ సినిమాను పక్కన పెట్టేశాడట. దీంతో గ్యాప్ లేకుండా సినిమా చేద్దాం అనుకున్న మహేష్ ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకోనున్నాడు. ఈ గ్యాప్‌లో ఆయన హిమాలయాలకు వెళ్లనున్నాడట. ఈ ఖాళీ సమయంలో ఆయన ఓ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని చూస్తున్నారట. అందుకోసం మహేష్ హిమాలయాలను ఎంచుకున్నారని టాక్. దీంతో అతి త్వరలో మహేష్ హిమాలయాలను సందర్శించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇలా ఆధ్యాత్మిక చింతనతో తరచుగా హిమాలయాలను సందర్శిస్తారు. రజనీ అక్కడకు వెళ్లినప్పుడల్లా ఓ బాబాను కలవడం జరుగుతుంది. ఇప్పుడు మహేష్ సైతం హిమాలయాలను సందర్శించాలని కోరుకోవడం ఆసక్తిరేపుతుంది.

  Mahesh babu to visit himalayas,Mahesh Babu with Geetha Govindam director,mahesh babu next movie,mahesh babu next movie update,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,telugu cinema news,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్,హిమాలయాలకు మహేష్ బాబు
  మహేష్, చిరంజీవి Photo : Twitter


  అది అలా ఉంటే మహేష్ బాబు.. చిరంజీవి 152వ సినిమాలో కనిపించనున్నాడట.  కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న 'ఆచార్య'లో ఓ పాత్రలో మెరవనున్నాడని టాక్. దీంతో పాటు వంశీ సినిమా ఆలస్యం కావడంతో మహేష్ తన కొత్త సినిమాను రాజశేఖర్‌తో ‘గరుడవేగ’ ను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారుతో చేయనున్నారని టాక్. దీనికి తోడు మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ అందించిన పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడని వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలోనే విడుదల చేయాలనీ చూస్తున్నారట దర్శక నిర్మాతలు. చూడాలి మరీ మహేష్ తన తదుపరి సినిమాను ఎప్పుడూ ఎవరితో మొదలు పెట్టనున్నాడో..  ఆయన కొత్త సినిమా ప్రకటన కోసం ఆసక్తిగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: