Mahesh Babu : మూడోసారి ఆ తమిళ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న మహేష్ బాబు..

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ మూడోసారి త్రిషతో నటించనున్నాడని తెలుస్తోంది.

  • Share this:
    Trisha Krishnan : త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ తమిళ పొన్ను 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగింది. ఇక ఆమె తెలుగు సినిమాలకు కాస్తా విరామం ఇచ్చింది. అది అలా ఉంటే త్రిష తాజాగా ఓ తెలుగు సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. మహేష్ బాబు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేస్తోందట. గతంలో ఈ త్రిష 'సైనికుడు', 'అతడు' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తాజాగా మరోసారి మహేష్ బాబుతో జత కట్టే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట. ఓ హీరోయిన్‌గా త్రిషను చిత్రబృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నారట.

    ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశముంది. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది.

    మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

    ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో  నిలవనుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండోచ్చని అంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: