మహేష్‌తో రొమాన్స్‌ చేయనున్న ప్రభాస్ భామ.. ఫిక్సైన చిత్రబృందం..

మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాకు దాదాపుగా హీరోయిన్ ఖారరైందని తెలుస్తోంది.

news18-telugu
Updated: April 20, 2020, 7:06 AM IST
మహేష్‌తో రొమాన్స్‌ చేయనున్న ప్రభాస్ భామ.. ఫిక్సైన చిత్రబృందం..
మహేష్ బాబు Photo : Twitter
  • Share this:
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ తర్వాత ఇంతవరకు ఆయన ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడని.. ఈ సినిమా దాదాపు ఖారరైందని తెలుస్తోంది. ఇక కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన  ఎవరైతే బాగుంటారో అని హీరోయిన్స్ కోసం చిత్రబృందం వెతుకుతోంది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేయడం తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ నటించబోతుందని, ఆ తరువాత కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఇంతకీ సూపర్ స్టార్ పక్కన నటించే ఆ హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ లేదు. సారా, కీర్తి, కియారాలలో, మహేష్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమంటే.. సాహోలో ప్రభాస్ సరసన అదరగొట్టిన  శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా  తీసుకొనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇక శ్రద్ధాకే చిత్ర బృందం ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ భామ సాహో' సినిమాలో అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది.

అది అలా ఉంటే మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని తెలుస్తోంది.  ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరో ఆసక్తి వార్త ఏమంటే.. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. ఉపేంద్ర.. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. గోపీసుందర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
Published by: Suresh Rachamalla
First published: April 20, 2020, 7:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading