Home /News /movies /

MAHESH BABU TO PLAY DUAL ROLE IN VAMSI PAIDIPALLY MOVIE HERE ARE THE DETAILS TA

మహేష్ బాబు సంచలనం.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇదే మొదటిసారి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

మహేష్ బాబు (Twitter/Mahesh Babu Parusuram movie)

మహేష్ బాబు (Twitter/Mahesh Babu Parusuram movie)

అవును మహేష్ బాబు హీరోగా నటించినప్పుటి నుంచి ఇప్పటి వరకు అలాంటి పాత్ర చేయలేదు. త్వరలో వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాలో ఆ పాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

    అవును మహేష్ బాబు హీరోగా నటించినప్పుటి నుంచి ఇప్పటి వరకు అలాంటి పాత్ర చేయలేదు. త్వరలో వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాలో ఆ పాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మరోవైపు సీనియర్ హీరోయన్ విజయశాంతి ఈ చిత్రంతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు మహేష్ బాబు కెరీర్‌లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లాడు. అక్కడ మోకాలికి శస్త్ర చికిత్స తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత వచ్చి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఈ  సినిమాను మహేష్ బాబుతో కలిసి దిల్ రాజు నిర్మించనున్నాడు.

    Mahesh babu to play dual role in vamsi paidipally movie here are the details,Mahesh babu,Mahesh babu dual role,mahesh babu first time play dual role,mahesh babu,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru collections,mahesh babu vamshi paidipally,tollywood,telugu cinema,మహేష్ బాబు,సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు డ్యూయల్ రోల్,మహేష్ బాబు ద్విపాత్రాభినయం,రెండు పాత్రల్లో మహేష్ బాబు,మహేష్ బాబు వంశీ పైడిపల్లి,మహేష్ బాబు వంశీ పైడిపల్లి మహర్షి
    కొడుకు దిద్దిన కాపురంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం (Youtube/Photo)


    ఈ చిత్రంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అప్పట్లో రజినీకాంత్ నటించిన ‘భాషా’ తరహాలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) లో నటించనున్నట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్ విషయానికొస్తే.. చిన్నపుడు తన తండ్రి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించాడు. ఆ తర్వాత ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాని’ చిత్రంలో చివరి సన్నివేశంలో తండ్రి కొడుకులుగా కనిపించి కాసేపు ప్రేక్షకులను ఆనంద పరిచాడు.

    Mahesh babu to play dual role in vamsi paidipally movie here are the details,Mahesh babu,Mahesh babu dual role,mahesh babu first time play dual role,mahesh babu,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru collections,mahesh babu vamshi paidipally,tollywood,telugu cinema,మహేష్ బాబు,సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు డ్యూయల్ రోల్,మహేష్ బాబు ద్విపాత్రాభినయం,రెండు పాత్రల్లో మహేష్ బాబు,మహేష్ బాబు వంశీ పైడిపల్లి,మహేష్ బాబు వంశీ పైడిపల్లి మహర్షి
    నాని సినిమాలో తండ్రి కొడుకులుగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ (youtube/Photo)


    ఈ సారి మాత్రం పూర్తిస్థాయిలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. మరి తొలిసారి అది పూర్తిగా రెండు పాత్రల్లో మహేష్ బాబు ఎలా అలరిస్తాడో అని మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood, Vamshi paidipally

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు