NTR | Mahesh Babu : ఎన్టీఆర్‌ అడ్డాలో మహేష్ బాబు.. ఇక వారిని అందుకోవడం కష్టమే..

Mahesh Babu and NTR Photo : Twitter

NTR | Mahesh Babu : ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ తెరపై అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జెమిని టీవీలో “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే గేమ్ షో ద్వారా ప్రతి రోజు టీవీ తెరపై కనిపిస్తూ అలరిస్తున్నారు. కాగా ఇదే షోకు మహేష్ బాబు గెస్ట్’గా వస్తున్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  ఎన్టీఆర్ (NTR) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ తెరపై కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన “ఎవరు మీలో కోటీశ్వరులు”  (Evaru Meelo Koteeswarulu) అనే గేమ్ షో ద్వారా ప్రతి రోజు టీవీ తెరపై కనిపిస్తూ అలరిస్తున్నారు. అంతేకాకుండా అదిరిపోయే రేటింగ్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్‌ బద్దలుకొట్టాడనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబందించిన షూట్ కూడా ఇటీవలే జరిగినట్లు సమాచారం. ఈ ఇద్దరు ఒకేసారి ఒకే షోలో కనిపించడం అంటే రేటింగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు నెటిజన్స్. ఇక ఇదే షోను గతంలో నాగార్జున‌, చిరంజీవి 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ మాటీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే షోను జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' పేరుతో ప్రసారం అవుతోంది.

  ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని గతంలో ప్రకటించినా.. తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీగా చెయ్యబోతున్నారు.

  ఎన్టీఆర్ 30 సినిమా విషయానికి వస్తే..

  ఎన్టీఆర్ 30లో కియారా అద్వానీ (Kiara advani) నటిస్తుందని టాక్ రాగా.. ఆమె స్థానంలో పూజ హేగ్డే  (Pooja Hegde )వచ్చి చేరింది అని తాజా సమాచారం. అంతేకాదు ఎన్టీఆర్ 30 లో పూజ హెగ్డే దాదాపు ఖరారు అయినట్లేనట. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా పూజాకు భారీ క్రేజ్ ఉండడంతో దర్శక నిర్మాతలు పూజా వైపు చూస్తున్నారట. ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

  ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తుండడంతో.. విలన్ గా ఓ బాలీవుడ్ స్టార్ ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. దీనిపై కొంత క్లారిటీ రావాలసిఉంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు.

  ప్రశాంత్ నీల్‌తో..

  ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు.

  ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో వస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

   రాజమౌళి దర్శకత్వంలో మహేష్..

  ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.  ఈ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
  Published by:Suresh Rachamalla
  First published: