• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU TO BE SEEN IN NAGA CHAITANYA NEW MOVIE AK

Naga Chaitanya Mahesh Babu: నాగచైతన్య మూవీలో మహేశ్ బాబు.. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

Naga Chaitanya Mahesh Babu: నాగచైతన్య మూవీలో మహేశ్ బాబు.. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

నాగచైతన్య, మహేశ్ బాబు( ఫైల్ ఫోటో)

Naga Chaitanya Mahesh Babu: అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మహేశ్ బాబు హాజరయ్యాడు. అలా అక్కినేని కుటుంబంతో తనకున్న ఫ్రెండ్లీ రిలేషన్‌ను చాటిచెప్పాడు.

  • Share this:
    టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉన్న హీరోలు మరో హీరో పేరు చెప్పడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. అంతగా మరో హీరో పేరు వాడాల్సి వస్తే.. తమ ఫ్యామిలీలోని సీనియర్ హీరోల గురించే ప్రస్తావిస్తుంటారు. మరో హీరోను తమ సినిమాల్లో హైలెట్ చేస్తే.. ఫ్యాన్స్ హర్ట్ అవుతుంటారన్నది వారి ఫీలింగ్. అయితే ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడియెన్స్ కూడా మారిపోయారు. ఓ హీరో సినిమాలో మరో హీరోకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఓ హీరో.. మరో హీరోపై అభిమానం చూపించే విషయంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు.

    తాజాగా ఈ విషయంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య మరో అడుగు ముందుకేశాడు. ఏకంగా తన నయా మూవీలో మరో హీరోకు అభిమానిగా కనిపించబోతున్నాడట నాగచైతన్య. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా థ్యాంక్యూలో నాగచైతన్య.. ఈ సినిమాలో మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ సినిమాలో నాగచైతన్య మహేశ్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడనే న్యూస్ లీకైంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని నిమిషాలపాటు మహేశ్ బాబు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో మహేశ్ బాబుకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి.

    అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మహేశ్ బాబు హాజరయ్యాడు. అలా అక్కినేని కుటుంబంతో తనకున్న ఫ్రెండ్లీ రిలేషన్‌ను చాటిచెప్పాడు. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ కనిపించి.. మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాండింగ్‌ను మహేశ్ బాబు మరోసారి గుర్తు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ నయా మూవీలో ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు