Home /News /movies /

MAHESH BABU TO ACT WITH KOLLYWOOD STAR HERO THALAPATHY VIJAY SB

Mahesh Babu: మరో బిగ్ మల్టీస్టారర్.. స్టార్ హీరో సినిమాలో మహేష్ బాబు..!

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu Photo : Twitter

మహేష్ బాబుకు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ స్టార్ హీరో సినిమాలో మహేష్ బాబు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

    టాలీవుడ్‌లో ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీల హవా నడుస్తుంది. బాహుబలి సినిమాలోప్రభాస్, రాణా కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన  ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇక టాలీవుడ్ ప్రిన్స్ ‌మహేష్ బాబు(Mahesh Babu) మల్టీ స్టారర్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్‌(Venkatesh)తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడుతాజాగా మమేష్ బాబు (Mahesh Babu) మరో స్టార్ హీరో సినిమాలో నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    ప్రస్తుతం దాదాపు మన దక్షిణాది సినిమా నుంచి అనేక మల్టీస్టారర్ సినిమాలు పడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాము. దీనితో కొన్ని డ్రీమ్ కాంబినేషన్స్ కూడా పడుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా పలు భారీ సినిమాల్లో అయితే కొందరు బిగ్ స్టార్స్ చిన్న క్యామియో రోల్స్ కూడా చేస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమలో హీరో సూర్య క్యామియో రోల్‌లో నటించాడు. ఇక ఇప్పుడు అలాగే మరో సెన్సేషనల్ మల్టీస్టారర్ లాంటి ట్రీట్ వస్తున్నట్లుగా  టాక్ వినిపిస్తుంది.



    మరి ఆ కాంబో కూడా ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay Joseph) మరియు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ల కాంబినేషన్లో అట. అయితే ఈ ఇద్దరికీ భారీ ఎత్తున ఫాలోయింగ్ తో పాటు ఇద్దరిని కలిపి అభిమానించే వారు కూడా మన తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఎక్కువే. మరి ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ని దర్శకుడు వంశీ పైడిపల్లి సెట్ చేస్తున్నట్టుగా క్రేజీ బజ్ వినిపిస్తుంది.

    ప్రస్తుతం విజయ్ చేస్తున్న తన 66వ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది. మరి ఇందులో మహేష్ ఒక చిన్న కామియో లో కనిపిస్తారని తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబు కూడా త్రిక్రమ్ డైెరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. అటు రాజమౌళితో కూడా మహేష్ సినిమా వస్తుందని సమాచారం.ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, Thalapathy Vijay

    తదుపరి వార్తలు