MAHESH BABU TO ACT WITH BOLLYWOOD HERO RANVEER SINGH MOVIE HERE ARE THE DETAILS TA
మరో క్రేజీ మల్టీస్టారర్‌కు మహేష్ బాబు ఓకే చెప్పాడా.. ?
మహేష్ బాబు (Twitter/Photo)
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ఓకే చెప్పాడా ? అది కూడా బాలీవుడ్ అగ్రహీరోతో ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ఓకే చెప్పాడా ? అది కూడా బాలీవుడ్ అగ్రహీరోతో ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ఈ యేడాది మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు మెగా కాంపౌండ్ భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
మహేష్ బాబు చిరంజీవి (Source: Twitter)
ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌తో భారీ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా మరో కీ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. తాజాగా మహేష్ బాబు డైరెక్ట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అది కూడా రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించబోతున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఓ వ్యాపార ప్రకటనలో మహేష్ బాబు.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించాడు. గత రెండేళ్లలో వీళ్లిద్దరు కలిసి ఇలా యాడ్స్‌లో నటించడం మూడోసారి. ఈ ప్రకటన షూట్ సందర్భంగా మహేష్ బాబు ముంబై వెళ్లాడు. అక్కడ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా..మహేష్‌ను కలిసినట్టు చెబుతున్నారు.
థమ్స్ అప్ యాడ్‌లో కలిసి నటించిన రణ్వీర్ సింగ్, మహేష్ బాబు (Twitter/Photo)
ఈయన మహేష్ బాబు, రణ్వీర్ సింగ్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్‌కు ఉన్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు దక్షిణాదిలో మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ భారీ ఉంది. ఈ ఇద్దరు కలిసి నటిస్తే.. రణ్వీర్ నార్త్ ఇండియా బాక్సాఫీస్‌ను శాసిస్తే.. మహేష్ బాబు సౌత్ ఇండియా బాక్సాఫీస్‌ను తన ఇమేజ్ కాసులు కురిపించగల సత్తా ఉంది. వీళ్లిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తే.. అన్ని చోట్ల బాక్సాఫీస్‌ను దున్నేయవచ్చేనేది బాలీవుడ్ నిర్మాత ప్లాన్ అని చెేస్తున్నాడు. మరి బాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీపై మాత్రం మహేష్ బాబు ఇంకా నిర్మాతకు ఔనని చెప్పలేదట. కాదని చెప్పలేదట. నిజంగానే మహేష్ బాబు ఈ ప్యాన్ ఇండియా మూవీ చేస్తాడా లేదా అనేది చూడాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.