Mahesh Babu - Thaman - Sakaru Vaari Paata : ’సర్కారు వారి పాట’ సెట్స్‌లో మహేష్ బాబుతో తమన్ సందడి చేసారు. దానికి సంబంధించిన ఫోటోను ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దూకుడు’ సినిమా నుంచి మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్’, ‘ఆగడు’ సినిమాలకు సంగీతం అందిచారు. ఇపుడు నాల్గోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా తమన్.. మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కీర్తి సురేష్ హీరోగా నటిస్తున్నారు. పరశురామ్ (Parasuram Petla) పేట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.
Latest Click of Superstar @urstrulyMahesh & @MusicThaman from the sets of #SarkaruVaariPaata pic.twitter.com/MLsiEqW5AW
— BA Raju's Team (@baraju_SuperHit) October 22, 2021
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ గోవాలో జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ (Vidya Balan) నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేయబోయే సినిమా ఉండనే ఉంది. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అటు అల్లు అరవింద్ నిర్మించే ‘రామాయణం’ సినిమాలో రాముడిగా నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఓ రేంజ్‌లో దూకుడు చూపిస్తున్నాడనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Thaman, Tollywood