మహేష్ బాబు ఆ నిర్ణయం తీసుకుంటారా.. ఒకవేళ నిజమైతే అభిమానులకు పండగే..

మహేష్ బాబు (Twitter/Mahesh Babu)

మహేష్ బాబు ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

  • Share this:
    మహేష్ బాబు ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లితో చేద్దామనకున్నాడు. ప్రస్తుతం వంశీ తో చేయబోయే సినిమాను హోల్డ్‌లో పెట్టి.. పరశురామ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న కొద్ది మందితో పూజా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అదే రోజు వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా విషయాన్ని కూడా అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ రకంగా వంశీతో చేయబోయే సినిమా విషయంలో అభిమానులకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్, రాజమౌళి సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అదే రోజు అఫీషియల్‌గా మహేష్ బాబు ప్రకటించనున్నాడు. ఒకవేళ ఈ రెండు సినిమాలు చేసే వరకు రాజమౌళి ఫ్రీ అయితే.. నెక్ట్స్ మూవీ జక్కన్నతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మహేష్ బాబు. ఒకవేళ రాజమౌళి అప్పటికీ ఫ్రీ కాకపోతే.. ప్లాన్ బీ ప్రకారం ప్రశాంత్ నీల్ ఉండనే ఉన్నాడు. ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 2 తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబులతో సినిమాలకు కమిటైయ్యాడు. మొత్తానికి తన తండ్రి పుట్టినరోజున మహేష్ బాబు తీసుకోబోయే నిర్ణయంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు  చూస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: