ఫారెన్ టూర్‌లోనే మ‌హేష్ బాబు.. వీధుల్లో విహ‌రిస్తున్న సూప‌ర్ స్టార్..

మ‌హేష్ బాబు ఇప్ప‌ట్లో ఇండియాకు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇంకా ఫ్యామిలీతో పాటు ఫారెన్ టూర్లోనే ఉన్నాడు సూప‌ర్ స్టార్. మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత విదేశాల‌కు వెళ్లిన మ‌హేష్.. ఇప్ప‌టికీ కుటుంబంతో క‌లిసి లండ‌న్ వీధుల్లో విహ‌రిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 5:06 PM IST
ఫారెన్ టూర్‌లోనే మ‌హేష్ బాబు.. వీధుల్లో విహ‌రిస్తున్న సూప‌ర్ స్టార్..
మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో
  • Share this:
మ‌హేష్ బాబు ఇప్ప‌ట్లో ఇండియాకు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇంకా ఫ్యామిలీతో పాటు ఫారెన్ టూర్లోనే ఉన్నాడు సూప‌ర్ స్టార్. మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత విదేశాల‌కు వెళ్లిన మ‌హేష్.. ఇప్ప‌టికీ కుటుంబంతో క‌లిసి లండ‌న్ వీధుల్లో విహ‌రిస్తున్నాడు. ఆ మ‌ధ్య ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా చూసిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత వెంట‌నే ఇండియాకు వ‌స్తాడేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇంకా అక్క‌డే ఉన్నాడు మ‌హేష్ బాబు. త్వ‌ర‌లోనే ఈయ‌న ఇండియాకు రానున్నాడు. జులై 1 నుంచి స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ మొద‌లు కానుంది.
దాంతో ఆ సినిమా మొద‌ల‌య్యే నాటికి ఇండియాకు రానున్నాడు మ‌హేష్. వ‌చ్చీ రాగానే స‌రిలేరు నీకెవ్వ‌రుతోనే బిజీ కానున్నాడు సూప‌ర్ స్టార్. ప్ర‌స్తుతం ఫారెన్ టూర్లో మ‌హేష్ బాబుతో పాటు వంశీ పైడిప‌ల్లి కూడా ఉన్నాడు. త‌న‌కు మ‌హ‌ర్షి లాంటి సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఆయ‌న్ని కూడా తీసుకుని ఈ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. మ‌హేష్ బాబు 25వ సినిమాగా వ‌చ్చిన మ‌హ‌ర్షి.. 100 కోట్ల షేర్ అందుకుంది. దాంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు మ‌హేష్ బాబు. మొత్తానికి ఈ ఆనందాన్నంతా విదేశాల్లోనే పూర్తి చేసి త్వ‌ర‌లోనే ఇండియాకు వ‌చ్చి అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు ఈయ‌న‌.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading