సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త వ్యాపారం...ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా మరో వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. ఈ సారి మహేశ్ స్వంతంగా వస్త్రాల బ్రాండ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: July 27, 2019, 5:37 PM IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త వ్యాపారం...ఏంటో తెలుసా..?
మహేశ్ బాబు మహర్షి
  • Share this:
ఇప్పటికే మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ప్రవేశించి రాణిస్తున్నటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా మరో వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. ఈ సారి మహేశ్ స్వంతంగా వస్త్రాల బ్రాండ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. త్వరలోనే సీక్రెట్ బయటపెడతామంటూ మహేశ్ టీమ్ https://www.spoyl.in/mahesh-babu అనే వెబ్ సైట్ లింక్ పేస్ట్ చేసింది. ఈ వెబ్ సైట్ లో కౌంట్ డౌన్ ప్రారంభించారు. అయితే మహేశ్ సైతం ఈ పోస్ట్ ను షేర్ చేయడం గమనార్హం. అయితే స్పాయల్ పేరిట వస్తున్న ఈ కామర్స్ సైట్ యువతీ యువకులకు సరికొత్త షాపింగ్ అనుభవం ఇచ్చేందుకు మహేశ్ రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే వస్త్ర వ్యాపారంలో ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ పేరిట సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించగా, బాలివుడ్ లో హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, సన్నీ లియోన్ సైతం సొంతంగా వస్త్రాల బ్రాండ్ ద్వారా వ్యాపారం రంగంలో ప్రవేశించారు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>