Home /News /movies /

MAHESH BABU SSMB MAHESH BABU REACHED 15 MILLION FOLLOWERS IN FACEBOOK HERE ARE THE DETAILS TA

Mahesh Babu : మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు.. ఆ క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్..

మహేష్ బాబు (Twitter/Photo)

మహేష్ బాబు (Twitter/Photo)

Mahesh Babu : మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఖాతాలో మరో రికార్డు.. ఆ క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్. వివరాల్లోకి వెళితే..

Mahesh Babu : మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఖాతాలో మరో రికార్డు.. ఆ క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు హీరో మహేష్ బాబుకు సినిమాల్లోనే కాదు... సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న తెలుగు హీరోగా రికార్డులకు ఎక్కారు. మహేష్ బాబుకు ట్విట్టర్‌లో 11.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  అంతేకాదు  ఇన్‌స్టాగ్రామ్‌లో 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా మహేష్ బాబు ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో  15 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. సౌత్ నుంచి ఈ ఫీట్ అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్ బాబు నిలిచారు.

ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ (Prarasuram) దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తోంది.  ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు.

మహేష్ బాబు ఫేస్‌బుక్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ (Facebook/Photo)


మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సముద్రఖని మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ మూవీస్‌లో మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు వరకు మాత్రం ఎక్కువ మంది ట్వీట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.  ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.

Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని సోషల్ మెసేజ్‌తో తెరెక్కిస్తున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడనేది ఈ మూవీ కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..


ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Mahesh babu, Sarkaru Vaari Paata, Tollywood

తదుపరి వార్తలు