Mahesh Babu - Srinu Vaitla : శ్రీను వైట్లతో దూకుడు సీక్వెల్‌కు మహేష్ బాబు ఓకే చెబుతారా.. ?

దూకుడు కాంబినేషన్ మహేష్ బాబు, శ్రీను వైట్ల (Twitter/Photo)

Mahesh Babu - Srinu Vaitla : శ్రీను వైట్లతో దూకుడు సీక్వెల్‌‌ను మహేష్ బాబుతో చేయాలని ఉందని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 • Share this:
  Mahesh Babu - Srinu Vaitla : శ్రీను వైట్లతో దూకుడు సీక్వెల్‌‌ను మహేష్ బాబుతో చేయాలని ఉందని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ గురువారంతో దూకుడు సినిమా విడుదలై 10 యేళ్లు పూర్తి చేసుకుంది. పూరీ జగన్నాథ్‌తో చేసిన ‘పోకిరి’ తర్వతా సరైన సక్సెస్‌లేని మహేష్ బాబు .. ‘దూకుడు’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కామెడీ ప్లస్ యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర టైటిల్‌కు తగ్గట్టు దూకుడు చూపెట్టింది. ఈ మూవీలో తొలిసారి మహేష్ బాబు సరసన సమంత కథానాయికగా నటించింది. ఇతర ముఖ్యపాత్రల్లో సుమన్,ప్రకాష్ రాజ్, సోనూసూద్, బ్రహ్మానందం,కోట,ఎం.ఎస్.నారాయణ నటించారు.

  దూకుడు సినిమా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు. దూకుడు సినిమాలో డైలాగ్స్ కానీ.. విజువల్స్ తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు తెలంగాణ యాసలో మాట్లాడడం ఏంతో ఫ్రెష్‌గా ఉండి తెలుగు వారికి తెగ నచ్చింది. అంతేకాదు రాజకీయ నాయకుడి పాత్రలో బ్రహ్మానందంను  బిగ్‌బాస్ అంటూ బకరా చేసే సీన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

  మ‌హేశ్ బాబు దూకుడు @ 7 ఇయ‌ర్స్.. mahesh babu dookudu @ 7 years completed..
  దూకుడులో మహేష్ బాబు (Twitter/Photo)


  ఈ సినిమా విడుదలైన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీను వైట్ల మహేష్ బాబు ఓకే చెబితే.. దూకుడుకు సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక దూకుడు తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘ఆగడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆగమైపోయింది. దీంతో మహేష్ బాబు మరోసారి శ్రీను వైట్లకు అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. ఇక ఆగడు నుంచి శ్రీను వైట్ల ఇప్పటి వరకు సక్సెస్ అన్నది లేదు. ఆ తర్వాత చేసిన ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్స్‌గా నిలిచాయి.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఇపుడు మంచు విష్ణుతో ‘డీ అంటే ఢీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఢీ’ మూవీకి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. కానీ శ్రీను వైట్ల కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలున్నాయి. వారి సినిమాల తర్వాత మహేష్ బాబు శ్రీను వైట్ల స్క్రిప్ట్ నచ్చితే ఈ  సినిమాకు ఓకే చెబుతారా అనేది చూడాలి.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  ఏమైనా వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లకు మహేష్ బాబు మళ్లీ దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అని చెప్పొచ్చు. మహేష్ బాబు.. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి డిఫరెంట్ సినిమాలు ఇచ్చిన పూరీ జగన్నాథ్‌కే ‘జనగణమన’ సినిమాకు ఓకే చెప్పలేదు. అలాంటిది శ్రీను వైట్లతో దూకుడు సీక్వెల్ అనేది సాధ్యమయ్యే పనికాదని మహేష్ బాబు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఏదైనా మిరాకిల్ జరిగి.. శ్రీను వైట్ల హిట్ ట్రాక్ ఎక్కితే.. దూకుడు సీక్వెల్ పట్టాలెక్కిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

  NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

  దూకుడు సినిమా విషయానికొస్తే.. రూ.  35 కోట్ల బడ్జెట్‌తో తీయగా.. ఈ చిత్రం రూ. 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌,రూ.  101 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దూకుడు ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా చరిత్ర నెలకొల్పింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: