హోమ్ /వార్తలు /సినిమా /

కూతురు సితారపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

కూతురు సితారపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

కూతురు సితారతో మహేష్ బాబు

కూతురు సితారతో మహేష్ బాబు

తన గారాలపట్టికి డాటర్స్ డే సందర్భంగా స్పెషల్‌గా విషెస్ తెలిపారు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డాటర్స్ డే సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. తన కూతురు సితారపై ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు. ‘నా బుజ్జి సితా పాపా నీకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుతూరివి. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను.’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు కూతురు సితారతో దిగిన ఫోటోలన్నీ కలిపి వీడియో పోస్టు పెట్టారు.

    మరోవైపు మహేష్ సతీమణి నమ్రత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సితారకు డాటర్స్ డే విషెస్ తెలిపారు. ఆమె కూడా ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. సితారకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో వెలుగు దివ్వెవు నువ్వు. నా ఆకాశంలో ప్రతిక్షణం మెరుస్తుండే చిన్ని తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు. లవ్‌ యూ సితార.’ అని నమ్రతా ట్వీట్ చేశారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Mahesh babu, Mahesh Babu Latest News, Namrata, Tollywood, Tollywood Movie News, Tollywood news