టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) క్యూట్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్నేళ్లుగా మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న నమ్రత- మహేష్ బాబు.. తమ ఇద్దరు పిల్లలపై ఎనలేని ప్రేమ కురిపిస్తుంటారు. వారి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార టాలెంట్ అందరికీ తెలిసేలా పలు పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తన కొడుకు గౌతమ్‌కి (Gautham Ghattamaneni) సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేస్తూ 'నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది' అని కామెంట్ చేసింది నమ్రత శిరోద్కర్.
మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అచ్చం తండ్రి రూపురేఖలతో అట్రాక్ట్ చేస్తుంటారు గౌతమ్. తాజాగా ఆయనలోని ఓ టాలెంట్ బయటపడింది. తన స్కూల్లో ఓ నాటకం వేశాడు గౌతమ్. స్నేహితులతో కలిసి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ తన నటనా ప్రతిభను చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ గౌతమ్ టాలెంట్ పై ప్రశంసలు గుప్పించింది నమ్రత.
ఈ వీడియోలో గౌతమ్ గెటప్ కొత్తగా, వింతగా కూడా ఉంది. గౌతమ్‌ని అలా చూసిన నెటిజన్లు అచ్చం మహేష్ బాబులా ఉన్నాడంటూ కామెంట్లు వదులుతున్నారు. మహేష్ బాబు లుక్స్ కొట్టొచ్చినట్లు కానిస్తున్నాయని, మరో తరానికి కాబోతున్న టాప్ స్టార్ హీరో అని పేర్కొంటున్నారు. గతంలో మహేష్ బాబు- సుకుమార్ కాంబోలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు గౌతమ్. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకు గౌతమ్‌ను స్క్రీన్ మీద కనిపించలేదు.
View this post on Instagram
మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని, మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో ఈ సినిమాను చాలా రిచ్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు మోహన్ బాబు , శోభన కూడా భాగమవుతున్నారని టాక్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.