Home /News /movies /

MAHESH BABU SON GAUTHAM BIRTHDAY NAMRATA SHIRODKAR WIDHES HER SON SK

టీనేజ్‌లోకి గౌతమ్... మహేష్ ఇంట్లో బర్త్‌డే వేడుకలు

గౌతమ్, మహేష్

గౌతమ్, మహేష్

తమ ముద్దుల కొడుకు టీనేజ్‌లోకి ప్రవేశించాడంటూ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు నమ్రత.

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంట పుట్టినరోజు పండగ జరిగింది. ఇవాళ ఆయన కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు. గౌతమ్ 13వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అర్ధరాత్రి మహేష్ కుటుంబ సభ్యులు గౌతమ్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ముద్దుల కొడుకు టీనేజ్‌లోకి ప్రవేశించాడంటూ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు నమ్రత. గౌతమ్ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

    గడియారంలోని ముల్లు 12 మీదకు రాగానే.. గౌతమ్‌ 13లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు అతను టీనేజర్‌. ఈ సందర్భంగా మహేశ్‌.. గౌతమ్‌కు ఎంతో ఇష్టమైన చాక్లెట్‌ను తినిపించి, ముద్దు పెట్టుకున్నారు. నా కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాను మిస్టర్‌ గౌతమ్‌ ఘట్టమనేని.
    నమ్రత
    కాగా, మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీలో నటిస్తున్నారు. మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక మందన్నా. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో విజయశాంతి, బండ్లగణేశ్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.


    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Mahesh babu, Namrata, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు