Home /News /movies /

MAHESH BABU SON GAUTAM GHATTAMANENI CLEARS 10TH WITH DISTINGUISHED MARKS SB

Mahesh Babu: మహేశ్ బాబు కొడుకు గౌతమ్ టెన్త్ రిజల్ట్స్.. ఏ గ్రేడ్ వచ్చిందంటే?

మహేష్ బాబు ఫ్యామిలీ

మహేష్ బాబు ఫ్యామిలీ

ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌లో ఉన్నారు. ఈ సమయంలోనే గౌతమ్ రిజల్ట్స్ రావడంతో అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు.

    సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu(, నమ్రతా శిరోద్కర్(Namrata Shirodhkar) కుమారుడు గౌతమ్ ఘట్టమనేని(Gautam Ghattamaneni). ఈయన 2006 ఆగస్టులో హైదరాబాద్ లోనే జన్మించాడు. స్టార్ కిడ్ గా గౌతమ్ అందరికీ తెలుసు. గౌతమ్ తాజాగా తన స్కూల్ ఎడ్యుకేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చిరెక్ (CHIREC) ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల పది ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ సందర్భంగా గౌతమ్ టెన్త్ రిజల్ట్స్ లో ప్రథమ గ్రేడ్ ను సాధించాడు. దీంతో కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గౌతమ్ టెన్త్ ఫలితాలపై తల్లిదండ్రులు మహేష్ బాబు, నమ్రత గౌతమ్ ను అభినందిస్తూ తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    ఈ సందర్భంగా మహేష్, గౌతమ్ ను ఉద్దేశించి మెసేజ్ చేస్తూ.. ‘గౌతమ్ గర్వంగా ఉంది!! ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి’ అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో మహేష్ – గౌతమ్ మధ్య అనుబంధం, ప్రేమ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా సితార, గౌతమ్‌ల తో మహేష్ ఎప్పుడు సరదాగా గడపడం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మరోవైపు నమ్రత గౌతమ్ ను అభినందిస్తూ, భవిష్యత్ లక్ష్యాన్ని సూచించి సుధీర్ఘమైన నోట్ కూడా రాసింది. 'గౌతమ్ పదో తరగతి పూర్తి చేశాడు. పది ఫలితాల్లో తను గ్రేడ్ 10 సాధించాడు. అలాగే తన సబ్జెక్ట్‌లన్నింటిలో మంచి ఉత్తీర్ణత సాధించాడు!! నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఉన్నాను. మరో ఫేజ్, కొత్త ఛాలెంజ్ లనూ ఇలాగే చేధించాలి. మేము ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాం. నీవు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాం. నీ విధికి నువ్వే రాజు. ఇలాగే మమ్మల్ని గర్వించేలా చేస్తూ ఉండాలి' అని పేర్కొంది.



    గౌతమ్ చదువుతో పాటు ఇతర యాక్టివిటీల్లోనూ చురుకుగానే ఉంటున్నారు. ఇప్పటికే తన తండ్రి మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి చైల్డ్ ఆర్టిస్గ్ గా '1 నేనొక్కడినే' చిత్రంలో నటించాడు. బిగ్ స్క్రీన్ పై కనిపించి తెలుగు ఆడియెన్స్ ను పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా 2018లోనే గౌతమ్ తన ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌ని ప్రారంభించి, తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌ పోటీల్లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. మహేష్ కూతురు సితారా కూడా 'సర్కారు వారి పాట' చిత్రంలో తండ్రితో కలిసి నటించింది. మరోవైపు సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీ కలిసి ఫారిన్ ట్రిప్‌లో ఉన్నాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Gautham, Mahesh Babu, Namrata Shirodkar, Sitara ghattamaneni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు