Mahesh Babu: తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున మహేష్ బాబు అదిరిపోయే గిఫ్ట్..

మహేష్ బాబు (Mahesh Babu Photo : Twitter)

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు మరో కానుకను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు మరో కానుకను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఎపుడు  తన తండ్రి పుట్టినరోజున తనకు సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడం మహేష్ బాబుకు అలవాటు. ఈ సారి కరోనా నేపథ్యంలో మహేష్ బాబు.. తన తండ్రి సూపర్ స్టార్ బర్త్ డే రోజున తన సినిమాకు సంబంధించిన ఒక అప్టేట్ ఇవ్వనున్నట్టు సమాచారం.  సూపర్‌స్టార్‌ కృష్ణ ఈనెల 31న తన 78వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. అయితే తండ్రి జన్మదిన్నాన్ని ఆయన కుమారుడు మహేశ్‌బాబు కరోనా నేపథ్యంలో  ఈ సారి సింపుల్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సెలబ్రేట్ చేసుకోనున్నట్టు సమాచారం. ఈ బర్త్ డే రోజున మహేష్ బాబు.. ’సర్కారు వారి పాట’కు సంబంధించిన అప్డేట్‌తో పాటు.. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాదు అదే రోజు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం.

    ఇక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. అప్పటి వరకు మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను దేశ బ్యాంకింగ్ రంగంలో జరిగిన కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ (mahesh babu krishna)
    సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ (mahesh babu krishna)


    ఈ సినిమాలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: