తొలిసారిగా ఫ్యామిలీతో కలిసి నటించిన మహేష్ బాబు

అయితే వారంతా ఏదో సినిమాలో కలిసి నటించలేదు. ఓ ప్రకటనలో మాత్రమే మహేష్ ప్యామిలీ అంతా కలిసి యాక్ట్ చేసింది.

news18-telugu
Updated: October 24, 2019, 10:03 AM IST
తొలిసారిగా ఫ్యామిలీతో కలిసి నటించిన మహేష్ బాబు
ఫ్యామిలీతో కలిసి నటించిన మహేష్ బాబు
  • Share this:
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తోంది.భార్య నమ్రతా, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కాస్త టైం దొరకినా మహేష్ ఆనందంగా గడుపుతారు. ఆ మధుర స్మృతులను తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేస్తూ అభిమానులకు షేర్ చేస్తుంటారు. అలాంటి మహేష్ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి నటిస్తే ఎలా ఉంటుంది. వినడానికి అద్భుతంగా ఉన్న ఈ విషయం నిజంగానే నిజం. అయితే వారంతా ఏదో సినిమాలో కలిసి నటించలేదు. ఓ ప్రకటనలో మాత్రమే మహేష్ ప్యామిలీ అంతా కలిసి యాక్ట్ చేసింది. దీంతో ఆ విషయాన్ని ఇప్పుడు మహేష్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ యాడ్ ను మీరూ చూడవచ్చు.


ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకురానున్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: October 24, 2019, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading