కూతురుతో అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు...

మహేష్.. తన కూతురు సితారతో ఓ అపురూపమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

news18-telugu
Updated: October 20, 2019, 12:06 PM IST
కూతురుతో అపురూపమైన ఫోటోను షేర్ చేసిన మహేష్ బాబు...
Instagram/urstrulymahesh
news18-telugu
Updated: October 20, 2019, 12:06 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు  ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కర్నూలులోని కొండా రెడ్డి బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు. కాగా ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేయనున్నారు. దీంతో ఓ వైపు షూటింగ్, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉంది చిత్ర బృందం. 
Loading...

View this post on Instagram
 

Situpapa...my baby bundle...♥♥♥


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

అది అలా ఉంటే.. తీరిక సమయాల్లో తన పిల్లలతో గడుపుతుంటారు మహేష్. అందులో భాగంగా గతంలో కూడా తన గారలపట్టి సితార ఫోటోస్‌ను, ఆమె బాహుబలి పాటకు డాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మహేష్.. తన కూతురు సితారతో ఓ అపురూపమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలో తండ్రి కూతుళ్ళు అదిరిపోయారు. మహేష్ ఫోటోను షేర్ చేయడంతో పాటు.. సీతూ పాప... మై బండిల్ అంటు రాసుకున్నారు. ఈ అపురూపమైన ఫోటోను చూసిన ఆయన అభిమానులు ఆ ఫోటోపై తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఫోటో అదిరిపోయిందని.. సూపర్ పిక్ అని.. క్యూట్‌గా ఉన్నారంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


 
View this post on Instagram
 

Back to work and school 😍😍😍


A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

మహేష్ బాబు గారాల పట్టి సితార క్యూట్ ఫోటోస్
First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...