MAHESH BABU SAYS WHY HE REJECTED SUKUMAR AND ACCEPTED ANIL RAVIPUDI STORY INSTEAD OF IT PK
సుకుమార్ సినిమా అందుకే కాదన్నాను.. కారణం చెప్పిన మహేశ్ బాబు..
సుకుమార్ మహేష్ బాబు (sukumar mahesh)
సుకుమార్, మహేశ్ బాబు సినిమా ఆగిపోవడంతో ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. రంగస్థలం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అభిమానులకు కూడా తెలుసు.
సుకుమార్, మహేశ్ బాబు సినిమా ఆగిపోవడంతో ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. రంగస్థలం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అభిమానులకు కూడా తెలుసు. దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి సినిమా అంటే ఇంకా ఎక్కువ ఊహించుకున్నారు ఫ్యాన్స్. అయితే ఉన్నట్లుండి ఆ సినిమా ఆగిపోవడంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. బ్లాక్ బస్టర్ దర్శకున్ని కాదంటున్నాడు.. మహేశ్ బాబుకు ఏమైంది అసలు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.
సుకుమార్ మహేష్ బాబు
ఆ సినిమా ఎందుకు ఆగిపోవడం వెనక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపెట్టాడు సూపర్ స్టార్. సుకుమార్ సిద్ధం చేసిన కథ మహేశ్ బాబుకు నచ్చింది కానీ.. అది పూర్తిగా సీరియస్ స్టోరీ.. అక్కడే అసలు దెబ్బ కొట్టేసింది. నిజానికి మహర్షి కూడా సీరియస్ కథే.. ఇలాంటి సీరియస్ స్టోరీ చేసిన తర్వాత కాస్త రిలీఫ్ కోసం ఎంటర్టైనర్ చేయాలని ఫిక్సయ్యాడు మహేశ్ బాబు. కానీ మరోసారి సుకుమార్ సీరియస్ కథే తీసుకురావడంతో అది పక్కనబెట్టి అనిల్ రావిపూడి కథ ఓకే చేసానని చెప్పాడు సూపర్ స్టార్.
మహేశ్ బాబు, అనిల్ రావిపూడి
మహర్షి సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఈయన.. సుకుమార్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం బయటపెట్టాడు. అంతేకానీ ఇంకే కారణాలు లేవని.. భవిష్యత్తులో తప్పకుండా సుకుమార్ సినిమా చేస్తానంటున్నాడు ఈయన. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఈ చిత్రం ఆగిపోవడం ఓ రకంగా షాకే అయినా.. అనిల్ రావిపూడి లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా ఓకే చేయడం కూడా ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తుంది. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.