మహేష్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది సర్కారు వారి పాట టీం. అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట(Sarkaru vaari paata) ట్రైలర్ విడుదలకు ముహుర్తం కుదిరింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ ఏప్రిల్ 29న విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అదే రోజున చిరంజీవి ఆచార్య సినిమా కూడా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఆచార్య థియేటర్లలో సర్కారు వారి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే మహేష్ ‘ఆచార్య’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలిసిందే. దీంతో మహేష్ సినిమాను ఆచార్య (Acharya)థియేటర్లలో విడుదల చేస్తే బావుంటుందని భావిస్తున్నారట.
సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)సినిమా ఒక్కటి రాలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మహేష్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం సర్కారు వారి పాట.దీనికోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి సినిమాపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. సర్కారు వారి పాట చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. థమన్ సంగీతం అందించాడు.
మరోవైపు ఈ సినిమా ట్రైలర్ అంతా ఫుల్ యాక్షన్‌తో కూడుకుని ఉన్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. కళావతి పాటైతే రికార్డులు బద్దలుగొడుతోంది. మ్యూజిక్ లవర్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ పాట తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించింది. ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో..సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata