హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: ట్రంప్ అడ్డాలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. ప్లాన్ సిద్ధం చేసిన పరశురామ్..

Mahesh Babu: ట్రంప్ అడ్డాలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. ప్లాన్ సిద్ధం చేసిన పరశురామ్..

కరోనా సమయంలో కూడా మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుని సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా జరుగుతుంది.

కరోనా సమయంలో కూడా మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుని సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా జరుగుతుంది.

Mahesh Babu Sarkaru Vaari Pata: కరోనా కంటే ముందు నుంచి కూడా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం అందుకున్న ఈయన మార్చ్ వరకు ఖాళీగానే ఉండాలనుకున్నాడు..

కరోనా కంటే ముందు నుంచి కూడా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం అందుకున్న ఈయన మార్చ్ వరకు ఖాళీగానే ఉండాలనుకున్నాడు.. అయితే కరోనా కారణంగా మరో ఆర్నెళ్లు ఎక్కువే రెస్ట్ తీసుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పటికి కూడా మహేష్ షూటింగ్ మోడ్‌లోకి వచ్చినట్లు కనిపించడం లేదు. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇప్పట్లో చేయలేనంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా మొదలైంది. కరోనా వైరస్ కారణంగా సైలెంట్‌గా సినిమాను మొదలు పెట్టారు. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసారు.

మహేష్ బాబు సర్కారు వారి పాట (sarkaru vaari pata)
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)

ఆ తర్వాత కృష్ణ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఇదిలా ఉంటే రెగ్యులర్ షూటింగ్ మాత్రం కోవిడ్ తగ్గిన తర్వాత ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఎలాగూ అది అలాగే ఉండటంతో తన ప్లాన్స్ తాను సిద్ధం చేసుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్. సెప్టెంబర్‌లోనే సర్కారు వారి పాట లొకేషన్స్ కోసం అమెరికా వెళ్లాడు దర్శకుడు పరశురామ్. అక్కడ పలు చోట్ల తిరిగిన దర్శకుడు కొన్ని కన్ఫర్మ్ చేసాడు. అందులోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు పరశురామ్. అయితే నవంబర్‌లో అమెరికాలో ఎన్నికల కారణంగా సర్కారు వారి పాట సినిమా కొన్ని రోజులు ఆలస్యం కానుంది.

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ (Twitter/Photo)
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ (Twitter/Photo)

అక్కడ ఎన్నికలు ముగిసిన తర్వాతే సర్కారు వారి పాట యూనిట్ సభ్యులు అమెరికాకు వెళ్లబోతున్నారని తెలుస్తుంది. అమెరికాలోనే దాదాపు 45 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుని జనవరిలో ఇండియాకు రాబోతున్నారు యూనిట్. మహేష్ బాబు కూడా ఇందులో పాల్గొంటాడని ప్రచారం జరుగుతుంది. నవంబర్‌లో ఆయన సెట్‌లో అడుగు పెట్టనున్నాడు. అమెరికాలో సింగిల్ షెడ్యూల్‌తో మెజారిటీ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్. అమెరికా షెడ్యూల్ తర్వాత ఇండియాలో కేవలం 30 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని.. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు.

మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)
మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)

మరోవైపు పరశురామ్ ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. తక్కువ పని రోజుల్లోను సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు పరశురామ్. సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా చాలా తక్కువ సమయంలో అనిల్ రావిపూడి పూర్తి చేసాడు కాబట్టే అన్ని లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలో కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు పరశురామ్. పైగా ఈ సినిమాకు మహేష్ బాబు కూడా ఓ నిర్మాతగా ఉన్నాడు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌‌గా నటించబోతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, Sarkaru vaari pata, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు