Mahesh Babu-Keerthy Suresh : కీర్తి సురేష్‌కు నో చెప్పిన మహేష్.. హిందీ భామతో రొమాన్స్ సై..

Mahesh Babu-Keerthy Suresh : మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 19, 2020, 11:04 AM IST
Mahesh Babu-Keerthy Suresh : కీర్తి సురేష్‌కు నో చెప్పిన మహేష్.. హిందీ భామతో రొమాన్స్ సై..
మహేష్, కీర్తి సురేష్ Photo : Twitter
  • Share this:
మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటగా వస్తోన్న ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందని మొన్నటి దాకా టాక్ నడిచింది. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు కీర్తి సురేష్‌ను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ వేరొక స్టార్ హీరోయిన్ కి షిఫ్ట్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. మహానటి కీర్తి స్థానంలో జాక్ పాట్ కొట్టే ఆ కథానాయిక ఎవరు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. అయితే ఓ పాపులర్ హిందీ భామను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఐదారు నెలలుగా మహమ్మారీ లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన మహేష్ సెట్స్ కెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పరశురామ్ పక్కాగా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారట. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో విడుదల ఆయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. విద్యా బాలన్.. ఎలాంటీ భావాలైనా పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది. తెలుగులో ఈ భామ బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రలో నటిస్తూ... ఎమోషనల్ సీన్లలో కట్టిపడేసింది. మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాటలో విద్యా బాలన్ మహేష్‌కు సోదరిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతోంది చిత్రబృందం. అందులో భాగంగా తొలి షెడ్యూలు షూటింగును నవంబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో ఇక ఆలస్యం చేయకుండా షూటింగ్ రెడీ అవుతోందట చిత్రబృందం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ 45 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 19, 2020, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading