Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA UPDATE MAHESH STARTING DUBBING FOR HIS PORTION HERE ARE THE DETAILS SR

Mahesh Babu : సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే అప్ డేట్.. అనుకున్న టైమ్‌కే విడుదల..

Mahesh Babu  Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu | Sarkaru Vaari Paata : సినిమా విడుదల తేదీ సమీపించడంతో మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసే పనిలో ఉన్నారని టాక్. దీనితో సినిమా వాయిదా అనేది ఉండదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఈ సినిమా మే 12 కే విడుదలకానుందని అంటున్నారు.

ఇంకా చదవండి ...
    Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంది. దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇక అది అలా ఉంటే సినిమా విడుదల తేదీ సమీపించడంతో మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసే పనిలో ఉన్నారని టాక్. దీనితో సినిమా వాయిదా అనేది ఉండదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఈ సినిమా మే 12 కే విడుదలకానుందని అంటున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది.

    ఇక తాజాగా ఈ సినిమా నుంచి పెన్నీ సాంగ్ (Penny Music Video) విడుదలైంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఇక మూడో పాటకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక సమాచారం విడుదలకానుంది. ఇక ఈ (Sarkaru Vaari Paata)  సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood news

    తదుపరి వార్తలు