హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu | Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Mahesh Babu | Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Sarkaru Vaari Paata Photo : Twitter

Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu | మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్త చేసుకున్న ఈ సినిమా మే 12 విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసేందుకు టీమ్ విడుదల తేదికి సంబంధించిన ఓ అప్ డేట్‌ను ఇచ్చింది.

ఇంకా చదవండి ...

Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్త చేసుకున్న ఈ సినిమా మే 12 విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసేందుకు టీమ్ విడుదల తేదికి సంబంధించిన ఓ అప్ డేట్‌ను ఇచ్చింది. ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ (Sarkaru Vaari Paata trailer release date) ని రేపు మే 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ ప్రకటన చేసింది. అలాగే దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో కూడా అదిరిపోయింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంది. స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంది. ఇక ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఇప్పటికే మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయడంతో పాటు పూర్తవ్వడం కూడా జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది.

ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ (Sarkaru Vaari Paata)  సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళిల సినిమాల్లో నటించనున్నారు.

First published:

Tags: Sarkaru Vaari Paata, Tollywood news

ఉత్తమ కథలు