Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA TO BE POSTPONED TODAY HERE ARE THE DETAILS SR

Mahesh Babu : మహేష్ బాబు సర్కారు వారి పాట మరోసారి వాయిదా పడనుందా..

Sarkaru Vaari Paata Photo : Twitter

Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు.

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు. దాదాపు 70 శాతం వరకు షూట్ కంప్లీట్ అయ్యిందని టాక్. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీమ్.
    మోకాలు సర్జరీ చేయించుకున్న మహేష్, ప్రస్తుతం దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నారు మహేష్. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకున్నప్పటికీ మహేష్ ఇప్పట్లో షూటింగుకి రాకపోవచ్చని అంటున్నారు. దీనికి తోడు కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువుగా అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్ రిస్టార్ట్ కాకపోవచ్చని టాక్ నడుస్తోంది. దీంతో అనుకున్న టైమ్‌కు షూటింగ్ పూర్తి కాకపోతే సర్కారు వారి పాట మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగనుందో.. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదలకావాల్సి ఉంది.

    అయితే ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి రేసులోకి రావడంతో మహేష్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ కరోనా కారణంగా మరోసారి వాయిదా పడడంతో ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనీ చూస్తున్నారు. దీంతో వేసవిలో పెద్ద సినిమాలకు మరోసారి గట్టిపోటీ ఉండనుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా వేసవిలో రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


    ఇక సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు.  ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు.

    Janhvi Kapoor : పూల బికినీలో శ్రీదేవి కూతురు పరువాల విందు.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

    ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Sarkaru Vaari Paata, Tollywood news

    తదుపరి వార్తలు