హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu - Sarkaru Vaari Paata : మహేష్ బాబు పుట్టినరోజున ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్‌కు టైమ్ ఫిక్స్..

Mahesh Babu - Sarkaru Vaari Paata : మహేష్ బాబు పుట్టినరోజున ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్‌కు టైమ్ ఫిక్స్..

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu - Sarkaru Vaari Paata : మహేష్ బాబు పుట్టినరోజున ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్‌కు టైమ్ ఫిక్స్ చేసారు. వివరాల్లోకి వెళితే..

  Mahesh Babu - Sarkaru Vaari Paata : మహేష్ బాబు పుట్టినరోజున ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్‌కు టైమ్ ఫిక్స్ చేసారు. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు తన పుట్టినరోజు ఆగష్టు 9న ’సర్కారు వారి పాట’ బ్లాస్టర్ అంటూ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ఆ బ్లాస్టర్ విడుదలకు టైమ్‌ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను దుబాయి‌లో పూర్తి చేసారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా రెడీ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా.

  ఇక ఈ సినిమా టీజర్‌ను బ్లాస్టర్ పేరిట మహేష్ బాబు పుట్టినరోజైన  ఆగష్టు 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh Babu, Mythri Movie Makers, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood

  ఉత్తమ కథలు