Mahesh Babu - Sarkaru Vaari Paata: మహేష్ బాబు ’సర్కారు వారి పాట’ నుంచి మరో లేటెస్ట్ అప్‌డేట్.. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ సినిమాను యూఎస్‌లో అనుకున్నారు. కానీ దుబాయ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసారు. ఆ తర్వాత రెండో షెడ్యూల్‌ను దుబాయ్‌తో పాటు గోవాలో చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండో షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా ఏర్పాటు చేసారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇంతలోనే సర్కారు వారి పాట టీమ్‌లో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలడంతో ఈ సినిమా షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసారు.
ప్రెజెంట్ మన దేశంలో కరోనా ఇపుడిపుడే కాస్త తగ్గు ముఖం పడుతోంది. దీంతో హీరోలు ఒక్కొక్కరుగా తమ షూటింగ్స్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూట్‌లో పాల్గొనే టీమ్ మెంబర్స్‌కు కరోనా టెస్టులు చేయిస్తే.. అందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఇక మహేష్ బాబు ఇప్పటికే తన టీమ్ మెంబర్స్ అందరికీ కరోనా టీకా వాక్సినేషన్ చేయించారు. ఈ రోజు నుంచి కంటిన్యూ మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇక ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు సమాచారం.
ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. నివేదా థామస్ కూడా ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించనున్నట్టు చెబుతున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ’జై లవకుశ’ తర్వాత మహేష్ బాబు ఈ తరహా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.
వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood