Mahesh Babu - Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమాకు కరోనా కాటు.. సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్.. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. మరోవైపు ఆసుపత్రుల్లో సరైన బెడ్లు లేక కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు కరోనాకు ఎవరు అతీతులు కాదనట్టు ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. మరోవైపు షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలుగు అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతకు ముందు ఎంతో మంది హీరోలు కరోనా బారిన పడ్డారు. తాజాగా మహేష్ బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో మొదలైంది. ముందుగా ఈ షెడ్యూల్‌ను దుబాయ్‌తో పాటు గోవాలో షూట్ చేయాలనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చసారు. ఇంతలోనే సర్కారు వారి పాట టీమ్‌లో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలడంతో ఈ సినిమా షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసినట్టు సమాచారం.
అంతేకాదు ‘సర్కారు వారి పాట’లోని టీమ్ మెంబర్స్ అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎపుడు ప్రారంభించేది త్వరలోనే తెలియజేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Keerthy Suresh, Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood