Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA SECOND SINGLE PENNY SONG BREAKING ALL THE RECORDS TOPPING ALL THE CHARTS SR

Sarkaru Vaari Paata | Penny Music Video : తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టిన మహేష్.. పెన్నీ సాంగ్ మరో సంచలనం..

Sarkaru Vaari Paata _ Penny Music Video Photo : Twitter

Sarkaru Vaari Paata _ Penny Music Video Photo : Twitter

Sarkaru Vaari Paata | Penny Music Video : ఈ సినిమా నుంచి రెండో పాట పెన్నీ సాంగ్ (Penny Music Video) విడుదలైంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. విడుదలైందో లేదో రికార్డ్స్ వ్యూస్‌ను దక్కించుకుంటోంది. అంతేకాదు ఈ (Penny Music Video) ఇప్పుడు టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇంకా చదవండి ...
    Mahesh Babu - Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 90 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. తక్కువ వ్యవధిలో తెలుగులో ఈ పాట ఈ రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట పెన్నీ సాంగ్ (Penny Music Video) విడుదలైంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. విడుదలైందో లేదో రికార్డ్స్ వ్యూస్‌ను దక్కించుకుంటోంది. అంతేకాదు ఈ (Penny Music Video) ఇప్పుడు టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడ విషయం ఏమంటే.. మహేష్ బాబు తన రికార్డ్‌ను తనే బద్దలు కొట్టారు. కళావతి పాటకి 24 గంటల్లో 14.78 మిలియన్స్ వ్యూస్ రాగా, 22 గంటల్లో ఈ పెన్నీ సాంగ్ కి 15 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఇప్పుడు తెలుగులో ఫాస్టెస్ట్ 15 మిలియన్స్ వ్యూస్ అందుకున్న పాటగా రికార్డ్‌కు ఎక్కింది. ఇక పాట విషయానికి వస్తే.. సాంగ్ మేకింగ్ గాని విజువల్స్ ఒక రేంజ్‌లో ఉంటే.. మహేష్ లుక్స్ మరో రేంజ్‌లో ఉన్నాయి. దీనికి తోడు సాంగ్ లిరిక్స్ చాలా ట్రెండీగా ఉంటూ తెగ ఆకట్టుకుంటున్నాయి. మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు.

    ఇక ఈ (Sarkaru Vaari Paata)  సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.


    ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood news

    తదుపరి వార్తలు