Sarkaru Vaari Paata - Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. రీసెంట్‌గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బ్లాస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు మహేష్ బాబు మరో పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నారు.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.
తాజాగా ఈ సినిమా గోవాలో తిరిగి ప్రారంభమైంది. అది కూడా ఇంటెన్సివ్ ఫైట్ సీన్‌ను చిత్రీరిస్తున్నారు. గోవా లోకేషన్‌లో రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ సీన్‌ను పిక్చరైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్‌ను ‘సర్కారు వారి పాట’ టీమ్ అభిమానులతో పంచుకున్నారు.
Team #SarkaruVaariPaata pumped up with the Blockbuster Response for the #BLASTER, Resumes Shoot in Goa with an Intense Fight choreographed by Ram-Laxman Masters ?
— SarkaruVaariPaata (@SVPTheFilm) August 13, 2021
Super?@urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/JmzNkONe06
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా ఉండనే ఉంది. అటు అల్లు అరవింద్ నిర్మించే ‘రామయణం’ సినిమాలో రాముడిగా నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఓ రేంజ్‌లో దూకుడు చూపిస్తున్నాడనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ నుంచి అదిరిపోయిన క్రేజీ అప్డేట్..
Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణేల ‘ఫైటర్’ మూవీ విడుదల తేది ఖరారు..
HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..
Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood