Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA RELEASE POSTPONED FOR THIS REASON HERE ARE THE DETAILS SR

Sarkaru Vaari Paata | Mahesh Babu : సర్కారు వారి పాట విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Sarkaru Vaari Paata | Mahesh Babu : ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించారు.

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించారు. కానీ మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.

  దీంతో సర్కారు వారి పాటు అనుకున్న డేట్‌లో అంటే సంక్రాంతికి విడుదలకాక పోవచ్చని అంటున్నారు. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా అని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన తరువాత రెండు, మూడు వారాల పాటు సర్కారు వారి పాట సినిమాకు సరైనా థియేటర్లు దొరక్కపోవచ్చని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద కూడా పడే అవకాశం ఉండడంతో ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట విడుదలను వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట. అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

  Anchor Sreemukhi : జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పెళ్లిలో మెరిసిన యాంకర్ శ్రీముఖి.. పిక్స్ వైరల్..

  ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు.

  ఇక ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

  ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

  Bigg Boss 5 Telugu Week 8 Nominations: బిగ్ బాస్ 5 తెలుగులో 8వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లేనా..?

  సర్కారు వారి పాట ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్  (Vidya Balan)నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

  ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Mahesh babu, Sarkaru Vaari Paata

  తదుపరి వార్తలు