Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA MA MA MAHESHA SONG ANOTHER RECORD THIS SONG CROSS 100 MILLION VIEWS IN YOUTUBE TA

Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మ మ..మహేశా సాంగ్ మరో రికార్డు..

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మహేశా సాంగ్ మరో రికార్డు (Twitter/Photo)

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మహేశా సాంగ్ మరో రికార్డు (Twitter/Photo)

Mahesh Babu - Sarkaru Vaari Paata - Mahesha Full Song  Released:  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాలోని మ మ.. మహేశా సాంగ్ మరో రికార్డును కైవసం చేసుకుంది.

ఇంకా చదవండి ...
    Mahesh Babu - Sarkaru Vaari Paata - Mahesha Song:  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా భారీ అంచనాల మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. అంతేకాదు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.  ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాలు తర్వాత మేకర్స్ ‘మురారి వా’ అనే ఓ స్పెషల్ సాంగ్ ని థియేట్రికల్ వెర్షన్ కి యాడ్ చేసారు.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

    ఇప్పటికే  ఈ సినిమాలోని కళావతి పాట 200 మిలియన్ వ్యూస్ యూట్యూబ్‌లో క్రాస్ చేసింది. ఈ యేడాది టాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో ఓ పాట 200 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఇదే ఫస్ట్. ఆ తర్వాత ఈ సినిమాలోని కళావతి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమాలో మ మ.. మహేశా సాంగ్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ యేడాది మహేష్ బాబు నటించిన ఒక సినిమాలోని రెండు పాటలు వంద మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.


    ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా థియేట్రికల్ రన్ మగిసింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది.



    అంతేకాదు మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా 91 శాతం రికవరీ పూర్తి చేసుకొని అబౌ యావరేజ్ మూవీగా నిలిచింది. సర్కారు వారి పాట  ఒక్క ఓవర్సీస్ తప్ప ఎక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రెస్టాఫ్ భారత్ ఎక్కడ బ్రేక్ ఈవెన్ కాకపోవడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు