Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA IN THE LAST SCHEDULE SHOOT STARTING AFTER DIWALI HERE ARE THE DETAILS SR

Sarkaru Vaari Paata | Mahesh Babu : చివరి షెడ్యూల్‌లో సర్కారు వారి పాట షూటింగ్.. దీపావళీ తర్వాత మొదలు..

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Mahesh Babu Sarkaru Vaari Paata Photo : Twitter

Sarkaru Vaari Paata | Mahesh Babu : మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుకోనుంది.

ఇంకా చదవండి ...
    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుకోనుంది. దీపావళి తర్వాత మొదలుకానున్న ఈ షెడ్యూల్‌తో సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానుంది. అయితే ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలను వస్తున్నాయి. ఓ వైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు గతంలో అధికారికంగా ప్రకటించిగా.. మధ్యలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అంతా తారుమారు అయ్యే సూచనలు ఉన్నాయని టాక్. అందులో భాగంగా సర్కారు వారి పాటు అనుకున్న డేట్‌లో అంటే సంక్రాంతికి విడుదలకాక పోవచ్చని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన తరువాత రెండు, మూడు వారాల పాటు సర్కారు వారి పాట సినిమాకు సరైనా థియేటర్లు దొరక్కపోవచ్చని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

    Chiranjeevi : చిరంజీవి సరసన తమన్నా ఖరారు.. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్..

    ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద కూడా పడే అవకాశం ఉండడంతో ‘సర్కారు వారి పాట’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట విడుదలను వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

    సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

    ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు.

    Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ సహా చిన్న వయసులో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..

    ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

    ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోందట. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

    సర్కారు వారి పాట ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్  (Vidya Balan)నటించనుందని సమాచారం. విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు.

    ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దీంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా ఉండనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh babu, Sarkaru Vaari Paata, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు