Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA FAME MAHESH BABU COMMENTS ON BOLLYWOOD EMBARRASS RAJAMOULI BEHIND THE REAL STORY TA

Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ పై చేసిన రాజమౌళిని హార్ట్ చేసాయా.. ? అసలు కథ ఏమిటంటే.. ?

రాజమౌళి సినిమాపై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ (Twitter/Photo)

రాజమౌళి సినిమాపై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ (Twitter/Photo)

Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ వ్యాఖ్యలు రాజమౌళిని ఇబ్బంది పెట్టాయా.. ? ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఈ మాటలు చిచ్చు పెట్టాయా..

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు ‘సర్కారు వారి పాట’ సినిమాతో పలకరించారు. దాదాపు రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుంచి వచ్చిన చిత్రం కావడం.. పైగా పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ తనను భరించలేదని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. పైగా మహేష్ బాబుకు వ్యతిరేకంగా కొంత మంది పనిగట్టుకొని బాలీవుడ్ మీడియాలో ఈ విషయాన్ని తెగ ప్రచారం చేశారు. దాంతో మహేష్ బాబు తాను బాలీవుడ్ తనను భరించలేదనే వ్యాఖ్యలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు. తాను తెలుగు సినిమాలతోనే కంఫర్ట్‌గా ఉన్నాను. టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ తీసుకొచ్చిందని మహేష్ స్పష్టం చేశారు.

    మహేష్ బాబు బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలపై రాజమౌళి కాస్త ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు హిందీ పరిశ్రమపై ఏమి అనకపోయినా.. ఆయన వ్యాఖ్యలను గోరంతను కొండంత చేస్తున్నారు. బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌ గురించి తాజగా మరో ఓ విలేకరి ప్రశ్నించగా...మహేశ్‌ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘బాలీవుడ్‌పై నేను ఎప్పుడు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్‌ సినిమాలు చేయనని చెప్పలేదు..నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్‌ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్లే ఆలోచనలేదు’ అని మహేశ్‌ చెప్పుకొచ్చారు.

    Chiranjeevi Old Titles : ‘రుద్రవీణ’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన సినిమాలు లిస్ట్ ఇదే..


    ఇక బాలీవుడ్ పై సూపర్ స్టార్ చేసిన ఈ  వ్యాఖ్యలు ఇపుడు రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ పై ఇంపాక్ట్ చూపిస్తుందా అనే డౌట్స్ ఉన్నాయి. అయితే.. రాజమౌళితో మహేష్ బాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరో 10 నెలల సమయం పడుతోంది. పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని  2024 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అప్పటికీ రెండేళ్లు అవుతోంది కాబట్టి.. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పటికీ ఎవరికీ పెద్దగా గుర్తు ఉండకపోవచ్చనే సమాధానం వస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం ఇండియానా జోన్స్ తరహా చాలా అడ్వెంచరస్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. తాజాగా మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమాకు హిట్ టాక్ రావడంపై మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Rajamouli, Sarkaru Vaari Paata, Tollywood

    తదుపరి వార్తలు