MAHESH BABU SARKARU VAARI PAATA FAKE COLLECTIONS WAR IN SOCIAL MEDIA SLB
ముదిరిన సర్కారు వారి పాట కలెక్షన్స్ వార్.. అన్నీ తప్పుడు లెక్కలంటూ ట్రోల్స్
Photo Twitter
రిలీజ్ రోజే పని కట్టుకొని మరీ సర్కారు వారి పాట సినిమా ఆశించిన మేర అలరించలేదంటూ దుష్ప్రచారం చేసిన కొందరు విడుదలై వారం రోజులు గడిచిపోయినా నేటికీ అదే ట్రాక్‌లో ఉన్నారు. #SVPDisaster, #SVPFakeCollections హ్యాష్ ట్యాగ్స్ వాడుతూ వరుస ట్వీట్స్ పెడుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) సినిమాపై ఓ రేంజ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. విడుదలైన రోజు నుంచే రంగంలోకి దిగిన యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. రిలీజ్ రోజే పని కట్టుకొని మరీ సర్కారు వారి పాట సినిమా ఆశించిన మేర అలరించలేదంటూ దుష్ప్రచారం చేసిన కొందరు విడుదలై వారం రోజులు గడిచిపోయినా నేటికీ అదే ట్రాక్‌లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగెటివ్ కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్స్ విషయమై ఓ రేంజ్ ట్రోల్స్ చేస్తున్నారు.
రిలీజ్ డే నుంచే కొంతమంది 'సర్కారు వారి పాట' నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా విడుదలైన అన్ని సెంటర్లలో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో రోజుకోరకంగా ఆన్ లైన్ మాధ్యమాలపై కనిపిస్తున్న కామెంట్స్ జనాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. #SVPDisaster, #SVPFakeCollections హ్యాష్ ట్యాగ్స్ వాడుతూ వరుస ట్వీట్స్ పెడుతున్నారు మహేష్ యాంటీ ఫ్యాన్స్. దీంతో ఈ ట్వీట్స్ వైరల్ పలు చర్చలకు తావిస్తున్నాయి.
మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటివరకు 98 కోట్ల నెట్, 155.40 కోట్ల గ్రాస్ రాబట్టిందని, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఇప్పటివరకు దాదాపు 85 శాతం రికవర్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ఈ సినిమా 100 కోట్ల బెంచ్ మార్క్ దాటేసిందని తెలుపుతూ అఫీషియల్ పోస్టర్స్ కూడా వదిలారు. దీంతో ఇది చూసి నెటిజన్స్ అటాక్ షురూ అయింది.
సర్కారు వారి పాట సినిమాపై చిత్ర యూనిట్ పేర్కొంటున్న కలెక్షన్స్ వివరాలన్నీ తప్పే అంటూ మైత్రి బ్యానర్‌పై ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. ఈ సినిమా సాధించిన వసూళ్లకు, మీరు చెబుతున్న లెక్కలకు పొంతనే లేదని అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నెట్టింట మహేష్ బాబు ఫ్యాన్స్ Vs యాంటీ ఫ్యాన్స్ అన్నట్లుగా గట్టి ఫైట్ మొదలైంది. కాగా, సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు సినిమాపై ఇలా ట్రోల్స్ నడుస్తుండటం టాలీవుడ్ సర్కిల్లోని పబ్లిక్ ఆశ్చర్యపోతున్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. విడుదలకు ముందు నుంచే ఆసక్తిరేకెత్తించే అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ఊహించిన విధంగానే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా క్రమంగా స్లో అవుతూ వస్తోంది.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.