Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA DIGITAL PREMIER ON JUNE 23RD AMAZON PRIME SB

Sarkaru Vaari Paata Ott Release: సర్కారు వారి పాట ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ (Twitter/Photo)

సర్కారు వారి పాట సినిమాపై అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా ప్రకటన చేయడం జరిగింది. జూన్ 23, 2022 నుండి చలనచిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

    సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ఈ సినిమా గతనెల 12న థియేటర్లలో విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సర్కారు వారి పాట  ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమాను మహేష్ బాబు అభిమానులు బాగా ఆదరించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వినోదం, సెకండ్ హాఫ్‌లో లేదని సగటు సినిమా ప్రేక్షకుడు పెదవి విరిచినా, కలెక్షన్లను మాత్రం ఈ సినిమా బాగానే రాబట్టింది.

    సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా చూడటానికి 199 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది.  ఈ రోజు, ప్రైమ్ వీడియో తాజాగా ప్రకటన చేయడం జరిగింది. జూన్ 23, 2022 నుండి చలనచిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ సినిమాలో నదియా, నాగబాబు, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు.



    ఈ చిత్రానికి థమన్ ఆకట్టుకునే సంగీతం అందించాడు. దానికి తోడు సినిమా విడుదలైన అంతకు ముందు చిత్రీకరించిన మరో పాటను జత చేయడంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని ఇదే నెల 23న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాను ‘సర్కారు వారి పాట’ను అమెజాన్ లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ వర్షన్స్ లోనూ చూసి ఆనందించొచ్చు. మరి ఈ మూడు భాషల్లో ఓటీటీలో ‘సర్కారు వారి పాట’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

    ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా ఈ సినిమాలోని కళావతి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. సర్కారు వారు పాట సినిమాలోని కళావతి పాట 200 మిలియన్ వ్యూస్ యూట్యూబ్‌లో క్రాస్ చేసింది. ఈ యేడాది టాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో ఓ పాట 200 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఇదే ఫస్ట్.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Amazon prime, Mahesh Babu, Sarkaru vari paata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు