Home /News /movies /

Mahesh Babu : ఇప్పటి వరకు ఉన్న చిరంజీవి రికార్డ్‌ను బద్దులుకొట్టిన మహేష్ బాబు..

Mahesh Babu : ఇప్పటి వరకు ఉన్న చిరంజీవి రికార్డ్‌ను బద్దులుకొట్టిన మహేష్ బాబు..

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆడియో రైట్స్‌ను సరిగమ సౌత్ దక్కించుకుంది. అయితే ఈ ఆడియో రైట్స్ కోసం సరిగమ సౌత్ నాలుగునర కోట్లు చెల్లించుకుందట. ఇదే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక నాన్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే థమన్ ఇస్తున్న ఆల్బమ్ పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉండనుందో చూడాలి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఇప్పటి వరకు చిరంజీవి ఆచార్య ఆడియో రైట్స్‌ రికార్డ్ రేటుకు అమ్మడుపోయాయి. ఆచార్య ఆడియో రైట్స్ నాలుగు కోట్లకు అమ్మడుపోగా.. ఆ రికార్డ్‌ను మహేష్ బాబు సర్కారు వారి పాట బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.


    ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh babu, Tollywood news

    తదుపరి వార్తలు