Sarkaru Vaari Paata 5 Days WW Collections : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. వీకెండ్ వరకు మంచి హోల్డ్ క్రియేట్ చేసినా ఈ సినిమా.. సోమవారం కాస్త డల్ అయినా.. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే రీతిలో కలెక్షన్స్ ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే మధ్య డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. ఆదివారంతో యూఎస్‌లో 2.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.
దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
సర్కారు వారి పాట తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలెక్షన్స్ ..
Day 1 : రూ. 36.01 కోట్లు
Day 2 : రూ. 11.04 కోట్లు
Day 3 : రూ. 12.01 కోట్లు
Day 4 : రూ. 12.06 కోట్లు
Day 5 : రూ. 3.64 కోట్లు
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ : రూ. 74.76 కోట్లు / (రూ. 108.60 కోట్లు)
నైజాం (తెలంగాణ): రూ. 28.67 కోట్లు / రూ. 36కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 9.34 కోట్లు / రూ. 13 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 10.06 కోట్లు / రూ. 12.50 కోట్లు
ఈస్ట్: రూ. 6.87 కోట్లు / రూ. 8.50 కోట్లు
వెస్ట్: రూ. 4.39 కోట్లు / రూ. 7 కోట్లు
గుంటూరు: రూ. 7.76 కోట్లు / రూ. 9 కోట్లు
కృష్ణా : రూ.4.78 కోట్లు / రూ. 7.5 కోట్లు
నెల్లూరు: రూ. 2.89 కోట్లు / రూ. 4 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 74.76 కోట్లు (రూ. 108.60 కోట్ల గ్రాస్ ) / రూ. 96.50 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 5.40 కోట్లు / రూ. 11.50 కోట్లు
ఓవర్సీస్ : రూ. 11.20 కోట్లు / రూ. 11 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 91.37 కోట్లు (రూ. 143.30 కోట్లు గ్రాస్) / రూ 120 కోట్లు మొత్తంగా ఈ సినిమా రూ. 29.53 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.
KGF 2 - RRR : ఆర్ఆర్ఆర్ బాటలో పే ఫర్ వ్యూ పద్ధతిలో ఓటీటీలో కేజీఎఫ్ 2 స్ట్రీమింగ్..
1st Day WW Share రూ. . 45.21 కోట్లు (70 కోట్ల గ్రాస్ )
2nd Day WW Share రూ. .: రూ. 13. కోట్లు ( రూ. 20 కోట్లు గ్రాస్)
3rd Day WW Share రూ. .: రూ. 14.01 కోట్లు (రూ. 22 కోట్లు)
4th Day WW Share రూ. .: రూ. 13.65 కోట్లు (రూ. 21.80 కోట్లు)
5th Day WW Share రూ. .: రూ. 5.50 కోట్లు (రూ. 9.50 కోట్లు)
ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 91.37 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ. 29.53 వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood