Mahesh Babu : ఆ కారణంగా ప్లాన్ మార్చిన మహేష్.. ఈసారి క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ అక్కడే..

మహేష్ Photo : Twitter

Mahesh Babu : 'సర్కారు వారి పాట' ' సినిమా షూటింగ్ ఈ నెలలో అమెరికాలో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వీసా సమస్యల వలన కుదరలేదు. దీంతో ఇప్పుడు ప్లాన్‌ మారిందని సమాచారం.

 • Share this:
  మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటగా వస్తోన్న ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. దీనికి సంబందించి ఇటీవల ఓ అధికారిక ప్రకటన కూడ విడుదలైంది.  ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో విడుదల ఆయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంతో మహేష్ తన హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని బలంగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో మొదలు అయ్యేది. కానీ అంత ఇపుడు తారుమారైంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలోనే అమెరికాలో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వీసా సమస్యల వలన కుదరలేదు. దీంతో ఇప్పుడు ప్లాన్‌ మారిందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో చిత్రీకరణ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఏకధాటిగా 45 రోజుల షెడ్యూల్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు.

  ఇక సినిమా షెడ్యూల్‌ ప్లానింగ్‌తో పాటు మహేష్ పర్సనల్‌ ప్లానింగ్‌ కూడా మారినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సినిమా యూనిట్‌ కంటే ముందుగానే మహేష్ తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లనున్నారట. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే ప్లాన్‌ చేశారట మహేష్.  ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చెయ్యాలని భావిస్తోందట చిత్రబృందం. షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు మూడు నెలల్లోనే సగానికి పైగా సినిమాను చిత్రీకరించారలనీ చిత్రబృందం భావిస్తోందట. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.

  విద్యా బాలన్.. ఎలాంటీ భావాలైనా పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది. తెలుగులో ఈ భామ బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రలో నటిస్తూ... ఎమోషనల్ సీన్లలో కట్టిపడేసింది. మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాటలో విద్యా బాలన్ మహేష్‌కు సోదరిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ 45 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published: