Mahesh Babu : పోకిరి తర్వాత మరోసారి మహేష్ సాహసం.. మ్యాజిక్ రిపీట్ కానుందా..

మహేష్ బాబు Photo : Twitter

Mahesh Babu : మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటగా వస్తోన్న ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతోంది. అయితే ఆ మధ్య ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్‌లో మహేష్ చాలా కొత్తగా.. న్యూ హేయిర్ స్టైల్‌లో కనబడుతూ అదరగొట్టాడు. అయితే ఆయన ఇలా ఓ సినిమాకు తన లుక్‌ను మార్చింది మాత్రం పూరి జగన్నాధ్ పోకిరి సినిమాకే. ఆ సినిమా మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది. ఆయన కేరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి మహేష్ లుక్ కూడా ఒక కారణం అంటారు ఆయన అభిమానులు. ఆ సినిమా తర్వాత మరే సినిమాకు ఆయన మరో సారి తన లుక్‌ను మార్చలేదు. కాగా మళ్ళీ ఇన్నేళ్లు తరువాత మహేష్ కొత్త లుక్‌తో వస్తున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ మరోసారి పూర్తి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా మహేష్ కెరీర్‌లో మరో మరిచిపోలేని సినిమాగా ఉండబోతున్నదని భావిస్తున్నారు.

    ఇక ఈ సినిమా సోషల్ మేసేజ్‌తో వస్తూ.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published: