MAHESH BABU SARILERU NEEKEVVARUALLU ARJUNTRIVIKRAM MOVIE IN 2020 SANKRANTHI RACE AND ALSO BALAKRISHNAS KRANTHINAGARJUNAS BANGARRAJURAJINIKANTHS DARBAR IN PONGAL RACE TA
సంక్రాంతి బరిలో మహేష్ బాబుకు పోటీగా అల్లు అర్జున్ సహా ఆ ముగ్గరు హీరోలు..
మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్
2020 సంక్రాంతికి ఇప్పటి నుంచే మన హీరోలు బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను వచ్చే పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సంక్రాంతి రేసులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. వీరిద్దరితో పాటు మరో ముగ్గురు స్టార్స్ కూడా తమ సినిమాలతో బాక్సాపీస్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు.
2020 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వస్తున్నాడు ప్రకటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు..ఫస్ట్ టైమ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తన్నాడు.2020 సంక్రాంతికి మహేష్ బాబు అఫీషియల్‌గా సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కూడా 2020 పొంగల్‌కు వస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ‘దేశ ముదురు’ సినిమా తర్వాత అల్లు అర్జున్ సంక్రాంతి పోటీలో దిగుతోన్న రెండో సినిమా ఇదే. మధ్యలో ‘ఎవడు’ సినిమా రిలీజైన అది రామ్ చరణ్ ఖాతాలోకి వెళుతోంది.
మహేష్ బాబు Vs అల్లు అర్జున్
మరోవైపు సంక్రాంతి రేసులో బాలకృష్ణ కూడా కే.యస్.రవికుమార్ సినిమాతో రంగంలోకి దిగడానికీ రెడీ అవుతున్నాడు. ‘క్రాంతి’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న హీరో గ్యాంగ్ స్టర్ ఎందుకయ్యాడు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉండే అంశం. పైగా పొలిటికల్ ఇష్యూస్ కూడా ఈ చిత్రంలో చర్చించబోతున్నాడు బాలకృష్ణ.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
బాలయ్య,నాగ్,రజినీ,
మహేష్, అల్లు అర్జున్,బాలయ్యతో పాటు నాగార్జున కూడా ‘మన్మథుడు 2’ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమాను తొందర్లనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. . గతంలో నాగ్ నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి రేసులో లేటుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. అందుకే ఇపుడు అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు.ఇంకోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘దర్బార్’ సినిమాను కూడా సంక్రాంతి రేసులో ఈ సినిమాలతో పోటీ పడనుంది. మొత్తానికి సంక్రాంతి రేసులో మొదటగా అడుగుపెట్టిన మహేష్ బాబుకు పోటీగా అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. వీరిద్దరితో పాటు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో పాటు రజినీకాంత్ కూడా రేసులో గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తానికి 2020 సంక్రాంతి పోటీలో ఫైనల్‌గా ఎవరు రేసులో నిలుస్తారనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.