సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా... సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచీ లేటెస్ట్గా రిలీజైన "హి ఈజ్ సో క్యూట్" సాంగ్ దుమ్మురేపుతోంది. సాంగ్ వచ్చిన 24 గంటల్లోనే 27 లక్షల మందికి పైగా ఈ సాంగ్ చూశారు. సాంగ్ లొకేషన్లు, మహేష్ బాబు, రష్మిక లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఐతే... ఈ సాంగ్‌లో రష్మిక ఉండటంతో... పాట చూసిన వాళ్లకు వెంటనే మరో సాంగ్ గుర్తుకొస్తోంది. అది ఏదో కాదు... ఇదే రష్మిక... గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో చేసిన... "ఏంటే ఏంటే ఓసి మనసా". ఈ రెండుసాంగ్స్ లిరిక్స్ పూర్తిగా వేరు. మ్యూజిక్ కూడా వేరు. అయినప్పటికీ రెండిటి కొరియోగ్రఫీ మాత్రం దాదాపు ఒకేలా ఉంది. రెండిటి లోనూ హీరోయిన్ హీరోను తెగ మెచ్చుకుంటూ... అతన్ని ప్రేమిస్తున్నట్లుగా ఉంటుంది. పైగా రెండు సాంగ్స్‌లో హీరోయిన్ రష్మికానే ఉండటంతో... మహేష్ బాబు సాంగ్ చూసిన వాళ్లకు వెంటనే ఈ సాంగ్ గుర్తుకొస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్... ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. అంతేకాదు జనవరి 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలో మిలిటరీ సాంగ్ సహా మూడు పాటల్ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్... తాజాగా... మహేష్ బాబును రష్మిక మందన్న ఆట పట్టిస్తున్న ‘హి ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేసింది.
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రతి మండే ఈ సినిమా విడుదల అయ్యేంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నట్టు సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ ప్రకటించింది. గత రెండు వారాలుగా ఈ సినిమా నుంచీ ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం ‘ హీ ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ పాటను తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ చాలా అద్భుతంగా పాడింది. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు నిర్మించారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.