news18-telugu
Updated: October 12, 2019, 9:04 PM IST
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు (Youtube/credtit)
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఉగ్రవాదులను ఏరివేసే మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్.. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు.

జనవరి 12న రిలీజ్ కానున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ (Twitter/Photo)
మహేష్ బాబు 16 ఏళ్ల క్రితం ‘ఒక్కడు’ సినిమాలో కొండారెడ్డి బురుజు దగ్గర చేసిన సీన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఐటెం గాళ్‌గా తమన్నా లేదా పూజా హెగ్డే చేయనుంది. ఇద్దరిట్లో ఒకరు చేయడం మాత్రం కన్ఫామ్ అని చెబుతున్నారు.ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతికి రిలీజైన మహేష్ బాబు సినిమాల్లో ఎక్కువ మటుకు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సొంతం చేసుకున్నాయి.అదే లెక్కన 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబు హిట్టు అందుకొని సంక్రాంతి హీరోగా సరిలేరు నాకెవ్వరు అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 12, 2019, 9:04 PM IST