‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ బిజినెస్.. మొత్తంగా మహేష్ ఎంత వసూలు చేయాలంటే..

మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈనెల 11న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఏయే ఏరియాల్లో ఎంత బిజినెస్ చేసిందంటే..

news18-telugu
Updated: January 5, 2020, 8:03 PM IST
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ బిజినెస్.. మొత్తంగా మహేష్ ఎంత వసూలు చేయాలంటే..
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ (Twitter/Photo)
  • Share this:
మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈనెల 11న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఆ అంచనాలకు తగ్గట్టే ‘సరిలేరు నీకెవ్వరు’ అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదిపై సప్పెన్స్ నడిచింది. తాజాగా నిర్మాతల గిల్డ్ ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 11నే థియేలర్స్‌లో విడుదల కానుంది. ఏరియా ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నైజాంలో రూ. 25 నుంచి రూ.26 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సీడెడ్ (రాయలసీమ)లో రూ.10 నుంచి రూ.11 కోట్ల మధ్య ఈ సినిమా రైట్స్ అమ్ముడు పోయాయి. మరోవైపు ఆంధ్రాలో అన్ని ఏరియాల్లో కలిపి రూ.33 కోట్ల వరకు అమ్ముడు పోయింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. కర్ణాటకలో రూ. 8 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.1.8 కోట్లు, ఓవర్సీస్ రూ.14 కోట్లు మొత్తంగా వాల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.100 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రూపేణా రూ.40 కోట్ల వరకు ఇప్పటికే చిత్ర నిర్మాతలు వెనకేసుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 5, 2020, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading