మహేశ్ బాబు అల్లు అర్జున్‌కు సైడ్ ఇచ్చాడా ? కాంప్రమైజ్ అయ్యారా ?

సరిలేరు నీకెవ్వరూ రిలీజ్ డేట్‌ను బట్టి చూస్తే... అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖరారైనట్టే అనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 12, 2019, 1:59 PM IST
మహేశ్ బాబు అల్లు అర్జున్‌కు సైడ్ ఇచ్చాడా ? కాంప్రమైజ్ అయ్యారా ?
అల్లు అర్జున్, మహేశ్ బాబు
  • Share this:
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవబోయే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్‌పై నెలకొన్న సస్పెన్స్ విషయంలో సగం క్లారిటీ వచ్చింది. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని రష్మిక ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్... పనిలోపనిగా సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను జనవరి 11న ఆడియెన్స్ ముందుకు తీసుకురానుంది. సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు రాబోయే ఈ సినిమాపై ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో... సరిలేరు నీకెవ్వరూ సినిమా మరో సూపర్ హిట్ అవుతుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

అయితే సరిలేరు నీకెవ్వరూ రిలీజ్ డేట్‌ను బట్టి చూస్తే... అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖరారైనట్టే అనే టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరూ మూవీ జనవరి 11న శనివారం రిలీజ్ అవుతోంది. సాధారణంగా సినిమాలు ఎక్కువగా శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వస్తుంటాయి. కానీ మహేశ్ బాబు నయా మూవీ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అల వైకుంఠపురములో సినిమా జనవరి 9న ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని... అందుకే మహేశ్ బాబు మూవీ కాస్త వెనక్కి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.

ఇలా చేయడం వల్ల ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ సేఫ్ సైడ్‌లో ఉంటాయనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మొత్తానికి మహేశ్ బాబు, బన్నీ తమ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారా లేదా అన్నది తెలియాలంటే అల వైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫామ్ కావాల్సి ఉంది.First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు